YS Sharmila : అరెస్ట్ చేసేందుకే బస్సు తగుల బెట్టారు
కేసీఆర్ సర్కార్ పై షర్మిల ధ్వజం
YS Sharmila : రాష్ట్రంలో ప్రతిపక్షాలు అమ్ముడు పోయాయి. ఈ తరుణంలో తాను ఒక్కదాన్నే సీఎం కేసీఆర్ ఆగడాలను, ప్రభుత్వ వైఫల్యాలను, కుటుంబం ఎలా దోచుకుంటుందో ప్రశ్నిస్తూ వస్తున్నందుకే తనపై కక్ష కట్టారంటూ వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
తాను చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని, తనను అరెస్ట్ చేసేందుకు సర్కార్ కుట్రలు పన్నుతోందంటూ ధ్వజమెత్తారు. ఆడబిడ్డనని చూడకుండా అనరాని మాటలు అన్నారని మండిపడ్డారు. కావాలని గులాబీ పార్టీకి చెందిన వారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఇలా చేశారంటూ ఫైర్ అయ్యారు షర్మిల(YS Sharmila).
తమ పార్టీకి చెందిన ప్రచార రథంపై దాడికి దిగారు. ఆపై రాళ్లతో పగుల గొట్టారు. అడ్డుకో బోయిన కార్యకర్తలను కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు షర్మిల. దమ్ముంటే కార్యక్షేత్రంలో తేల్చు కోవాలని ఇలా దొడ్డి దారిన దాడులకు దిగుతారా అంటూ నిలదీశారు.
ఈ ఘటనకు పాల్పడిన ఎమ్మెల్యే రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో తాను పాదయాత్ర చేపట్టేందుకు అనుమతి తీసుకున్నానని చెప్పారు. అయినా కావాలని దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు అమ్ముడు పోయాయని కానీ తాను ఒక్కదాన్నే కేసీఆర్ ఆగడాలను, దౌర్జన్యాలను, మోసాలను ప్రశ్నిస్తూ వస్తున్నానని తట్టుకోలేక ఇలాంటి నీచపు పనులకు దిగారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదు
Few people alleged to be TRS followers tried to lit YSRTP’s campaigning bus on fire in Warangal, attack happened after YS Sharmila made some controversial statements on #TRS MLA Sudharshan. #Telangana pic.twitter.com/MydabSCoP7
— Sowmith Yakkati (@sowmith7) November 28, 2022