YS Sharmila : అవినీతికి అందలం చర్యలు శూన్యం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి నిప్పులు చెరిగారు భారత రాష్ట్ర సమితి పార్టీపై, ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ పై. ఆమె గత కొంత కాలం నుంచీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ వస్తోంది. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ మండిపడింది.
తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై నిలదీసింది. అరెస్ట్ కూడా అయ్యింది. ఆ తర్వాత బెయిల్ పై తిరిగి వచ్చింది. ఆమె ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఈ స్కాం వెనుక ఆ పెద్ద మనుషుల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందించింది వైఎస్ షర్మిల(YS Sharmila). నీ దగ్గర చిట్టా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీసింది.
ఓ వైపు కొడుకు రియల్ ఎస్టేట్ , బిడ్డ లిక్కర్ దందా, ఎమ్మెల్యేలు ప్రజలపై పడి దోచుకోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు . ఎందుకని ఇంకా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేక పోతున్నారంటూ షర్మిల సీఎంను నిలదీశారు. దమ్ముంటే వెంటనే వారిని తొలగించాలని కోరారు.
Also Read : ఒకే రోజు మూడు పరీక్షలు ఒప్పుకోం