YS Sharmila : హామీలు అనేకం చర్యలు శూన్యం
సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి ఆమె రాష్ట్ర సర్కార్ ను, సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదన్నారు. కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆమె పరామర్శించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇప్పటి దాకా జిల్లాలో 30 వేలకు పైగా పంటలను కోల్పోయారని, బాధిత రైతులను ఆదుకోవాలని షర్మిల కోరారు.
ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని ఆ తర్వాత సీఎం మరిచి పోతారని ఎద్దేవా చేశారు. ఓ వైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదన్నారు. కోట్లాది రూపాయలతో సచివాలయం నిర్మించారని, కానీ పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ఇకనైనా కొత్త సెక్రటేరియేట్ కైనా కేసీఆర్ వస్తారో రారోనన్న అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయం సరే సమస్యల మాటేమిటి అని ఆమె ప్రశ్నించారు. లక్ష 20 వేల కోట్లతో కాళేశ్వరం కట్టాడని ఇంత ఖర్చు పెట్డడం అవసరమా అని షర్మిల నిలదీశారు. కమీషన్లు రావనే మ్యానిఫెస్టలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
Also Read : 3న నీరా కేఫ్ ప్రారంభం – శ్రీనివాస్ గౌడ్