YS Sharmila Kavitha : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలపై(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఓవర్ యాక్షన్ ఆపేయాలంటూ పేర్కొన్నారు. ఆపై తాము వదిలిన బాణం , తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్, సెటైర్లపై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఆమె ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితకు అంత సీన్ లేదని పేర్కొన్నారు. పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలు విన్నది లేదు..పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇచ్చిన హామీల ఊసే లేదు. పదవులే కానీ పని తనం లేని గులాబీ తోటలో కవిత(Kavitha) లాంటి వాళ్లకు కొదవ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ట్విట్టర్ లో వైరల్ గా మారాయి వీరి కామెంట్స్. ఇదిలా ఉండగా ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైఎస్ షర్మిల. ఆమె ఇప్పటి వరకు 3,500 కిలోమీటర్లు నడిచారు.
ఇదే సమయంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల కారును ధ్వంసం చేశారు. ఆపై ప్రచారం రథం (బస్సు)ను తగుల బెట్టారు. దీనిని నిరసిస్తూ షర్మిల కారు, బస్సుతో ప్రగతి భవన్ ముట్టడించేందుకు యత్నించారు.
ఆమెను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. షర్మిల టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చారు.
Also Read : షర్మిల అరెస్ట్ తీరు బాధాకరం – తమిళి సై
పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు.
— YS Sharmila (@realyssharmila) November 30, 2022