YSR Aasara : ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ ఖాతాల్లోకి డబ్బులు
మూడో విడత కింద 78.94 లక్షలు
YSR Aasara : ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రతీ ఇంటికి ఏదో ఒక లబ్ది జరిగేలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు విడతలుగా వైఎస్సార్ ఆసరా నిధులను అందజేసింది.
ఇక తాజాగా వైఎస్సార్ ఆసరా(YSR Aasara) మూడో విడత నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 25న ఏలూరు జిల్లా దేందలూరులో ఈ డబ్బుల జమ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. మూడో విడత కింద 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6419 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
కాగా ఇప్పటికే 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పును చెల్లిస్తామని హామీ ఇచ్చింది.ఈ మేరకు ఇప్పటికే 2 విడతల్లో రూ.12,758 కోట్లను అర్హుల ఖాతాల్లో జమ చేశారు.
మరోవైపు పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఎంపీలతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి(YS Jagan) అందజేశారు. రాష్ట్రం విభజన జరిగిన తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని వాపోయారు సీఎం.
ఇంకా అనేక అంశాలు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖ మంత్రులను ఆదేశించాలని పీఎంను కోరారు సీఎం. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ. 36, 625 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని గుర్తు చేశారు. దీని వల్ల రాష్ట్రంలో పనులు పెండింగ్ లో ఉన్నాయని వాపోయారు.
Also Read : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక