Delhi Liquor Scam : ఎంపీ మాగుంట కొడుకు అరెస్ట్
శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ్ మాగుంట
Delhi Liquor Scam : ఏపీలో కీలకమైన వ్యాపారవేత్తగా ఉన్న వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లకు ప్రమేయం ఉందటూ సీబీఐకి కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో(Delhi Liquor Scam) సంబంధం ఉందంటూ పేర్కొంది.
ఈ మేరకు రాఘవ్ మాగుంటను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢీల్లీ మద్యం(Delhi Liquor Scam) కుంభకోణంలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది ఈడీ. ఈ వారంలో మూడోది కావడం గమనార్హం.
ఈ మొత్తం లిక్కర్ స్కాం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి ఒంగోలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ్ మాగుంటను అరెస్ట్ చేసినట్లు శనివారం ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రాఘవ్ మాగుంటను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఇవాళ కోర్టులో హాజరు పరుస్తారు. అనంతరం కస్టడీలకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎంపీ మాగుంట లిక్కర్ డాన్ గా గుర్తింపు పొందారు.
Also Read : సచివాలయం ప్రారంభం వాయిదా