YSRCP Expels Corporators: విశాఖ వైసీపీలో రచ్చ ! నలుగురు వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్ !

విశాఖ వైసీపీలో రచ్చ ! నలుగురు వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్ !

YSRCP Expels: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల రచ్చకెక్కింది. టీడీపీ నుండి గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు, వైసీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ కు మధ్య నెలకొన్న వివాదాలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు సుధాకర్ పార్టీకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు సీటు కేటాయించినట్లు తెలియడంతో…. సీతంరాజు సుధాకర్ అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీను వీడుతున్నారు.

YSRCP Expels Corporators

ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్పొరేటర్స్‌ ఉరుకూటి నారాయణరావు, బిపిన్ జైన్, భాస్కర రావు, జానకిరామ్ లు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించి… ఎమ్మెల్యే వ్యవహార శైలిపై బహిరంగ ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ హైకమాండ్ ఆ నలుగురు కార్పోరేటర్లను సస్పెండ్ చేసింది. అయితే వీరి బాటలో మరికొందరు కార్పోరేటర్లు పార్టీను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ కార్పోరేటర్ల సస్పెన్షన్ వైసీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

మూడేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ(YSRCP) 58 వార్డులను గెలుచుకోగా, టీడీపీ(TDP) 30 వార్డులను గెలుచుకుంది. జనసేన మూడు, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు దక్కించుకున్నాయి. నాలుగుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని హరివెంకటకుమారిని వైసీపీ అధిష్టానం మేయర్‌ గా ఎంపిక చేశారు. దాదాపు మూడేళ్లపాటు జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆధిపత్యం చలాయిస్తున్న వైసీపీ… ఇటీవల గడ్డుకాలం ఎదుర్కొంటోంది. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వంశీకృష్ణ యాదవ్ ఇటీవల పార్టీకు రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ కార్పోరేటర్లు కూడా పార్టీను వీడి జనసేనలో చేరారు. ఇటీవల వైసీపీను వీడిన వంశీకృష్ణ యాదవ్… విశాఖ నగరంలో వైసీపీను ఖాళీ చేస్తానని సవాల్ విసిరారు. తాజాగా వైసీపీకు చెందిన మరో నలుగురు కార్పోరేటర్లను ఏకంగా అధిష్టానం సస్పెండ్ చేయడంతో అసలు విశాఖ వైసీపీలో ఏం జరుగుతోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read : Bullet Train in AP : ఏపీలో కొన్ని జిల్లాలకు బుల్లెట్ ట్రైన్ సదుపాయం కల్పించనున్న కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!