YSRCP Leader: లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

YSRCP : నంద్యాల జిల్లా లింగాపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళ్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను మాటువేసి గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉండటంతో ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

YSRCP Leader Murder

అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : YS Jagan: డీలిమిటేషన్‌ మీటింగ్ కు వైసీపీ డుమ్మా ! ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ !

Leave A Reply

Your Email Id will not be published!