YSRCP Meeting: ఈ నెల 22న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం !
ఈ నెల 22న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం !
YSRCP Meeting: ఈ నెల 19న జరగాల్సిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో శనివారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వీరితోపాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.
YSRCP Meeting..
అంతకు ముందు.. పార్టీ ఎంపీలతో ఆయన విడిగా భేటీ అయ్యారు. పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డి(రాజ్యసభ), లోక్‌సభలో పార్టీ నేతగా మిథున్‌రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డిలను నియమిస్తూ ప్రకటన చేశారు. పార్టీ ఎంపీలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అధికార కూటమికి కాస్త టైం ఇచ్చి పార్టీ తరఫున ప్రజా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు పిలుపు ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన వైసీపీ(YSRCP)… దానికి గల కారణాలను ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఒక్కొక్కరుగా పార్టీను వీడటంతో… విస్తృత స్థాయి సమావేశం అయ్యేసరికి మరికొంత మంది పార్టీను వీడనున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాదు… ఈ సమావేశానికి నాయకులు డుమ్మూ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన చాలా మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అజ్ఞాతంలోనికి వెళ్లిపోయారు. అయితే ఈ విస్తృత స్థాయి సమావేశానికైనా వారు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.
Also Read : G. Kishan Reddy: జమ్మూకశ్మీర్ ఇన్ చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి !