AP High Court: పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో వైసీపీ పిటిషన్‌ !

పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో వైసీపీ పిటిషన్‌ !

AP High Court: ఏపీ రాజకీయాలు వైసీపీ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. ఈ నేపథ్యంలో నిబంధలకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ నిర్మిస్తోన్న పార్టీ కార్యాలయాకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆయా నోటీసుల్లో హెచ్చరించింది.

AP High Court…

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)లో వైసీపీ నేతలు లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధచేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు పూర్తి సమాచారం ఇస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. అయితే తాము ఇప్పటికిప్పుడు పార్టీ కార్యాలయాలను కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీనితో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు స్టేటస్‌ కో పాటించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read : Deputy CM Pawan Kalyan: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు గల్లంతుపై పవన్ సీరియస్ !

Leave A Reply

Your Email Id will not be published!