YV Subba Reddy: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమ మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు అంటే మంగళవారం ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు మంగళవారం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఒంగోలు చేరుకుని పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు.