Zakia Wardak: 25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త ! పదవికి రాజీనామా !
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త ! పదవికి రాజీనామా !
Zakia Wardak :భారత్ లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ.18.6 కోట్ల విలువైన ఈ బంగారాన్ని ఆమె దుబాయ్ నుంచి భారత్ కు తన వస్త్రాల్లో తరలించారని.. తనిఖీల్లో ఈ విషయం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. దౌత్యపరమైన మినహాయింపు కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోలేదని డీఆర్‌ఐ తెలిపింది. గత నెల 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు.
Zakia Wardak:
గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు జకియా వార్దక్(Zakia Wardak) నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని… దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
Also Read :-H.D. Revanna: మహిళ కిడ్నాపింగ్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్ !