Atiq Ahmed : 100 కేసులు రూ. 11,000 కోట్ల ఆస్తులు
18 ఏళ్లకే మర్డర్ కేసు మాజీ ఎంపీ
Atiq Ahmed : యూపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ , మాజీ ఎంపీ అతిక్ అహ్మద్(Atiq Ahmed) , సోదరుడు అష్రఫ్ ల కాల్చివేత గురించే చర్చ జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే 18 ఏళ్లకే మర్డర్ కేసు నమోదైంది. చివరకు లైవ్ లో మాట్లాడుతుండగా కాల్పులకు గురయ్యాడు. సమాజ్ వాది పార్టీ నుంచి ఒకసారి, బీఎస్పీ నుంచి మరోసారి ప్రజా ప్రతినిధిగా గెలుపొందాడు. అంచెలంచెలుగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దానికి రారాజుగా మారాడు. ఒక రకంగా యూపీని శాసించాడు.
1990 లో, 2000 ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయ అస్థిరత, రాష్ట్రపతి పాలన బహుళ దశలను ఎదుర్కొంది. ఈ సమయంలో అతిక్ అహ్మద్ తన ప్రభావాన్ని చూపాడు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లోని దోపిడీ, భూ కబ్జా సిండికేట్ కు అతిక్ అహ్మద్ బాస్ గా మారాడని పోలీసు నివేదికలు చెబుతున్నాయి.
తూర్పు ఉత్తర ప్రదేశ్ లో అతిక్ అహ్మద్(Atiq Ahmed) పై హత్య, కిడ్నాప్ సహా 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కిడ్నాప్ కేసులో జీవిత ఖైదు పడింది. అతిక్ అహ్మద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా , సమాజ్ వాది పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలుపొందాడు. 62 ఏళ్ల అతిక్ అహ్మద్ పై మొదటి కేసు 44 సంవత్సరాల కిందట 1979లో హత్యకు గురైంది. 1989లో అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. ఆ తర్వాత అదే స్థానంలో ఎస్పీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాడు.
2004 లోక్ సభ ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ లోక్ సభ స్థానం నుండి పుల్ పూర్ నుండి పోటీ చేసి గెలుపొందాడు. రెండేళ్ల తర్వాత 2008లో యూపీ పోలీసుల ఎదుట అతిక్ అహ్మద్ లొంగి పోయాడు. సమాజ్ వాది పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఏ కేసులో దోషిగా తేలక పోవడంతో అతిక్ అహ్మద్ 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
అతిక్ అహ్మద్ 2017లో ఒక దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలులో ఉన్నప్పుడు కిడ్నాప్ నకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో అహ్మదాబాద్ లోని సబర్మతి జైలుకు తరలించారు.
అతిక్ అహ్మద్ పై 100 పేరున్న ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. 54 ట్రయల్స్ ను ఎదుర్కొంటున్నాడని యూపీ మంత్రి రాజేశ్వర్ సింగ్ తెలిపారు. పోలీస్ గ్యాంగ్ చార్ట్ ప్రకారం అతిక్ అహ్మద్ గ్యాంగ్ లో 144 మంది సభ్యులు ఉన్నారని , 10 మంది హైకోర్టు న్యాయమూర్తులు అతడి కేసులను విచారించకుండా విరమించుకున్నట్లు చెప్పారు. అతిక్ ఆస్తులు రూ. 11,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరించి మాఫియా డాన్ గా ఎదిగిన అతిక్ అహ్మద్ ప్రస్థానం ప్రయాగ్ రాజ్ తో ముగిసింది.
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత