11 Banks Support : ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకుకు బ్యాంకుల భ‌రోసా

11 బ్యాంకుల చేయూత ఇచ్చేందుకు ప్ర‌క‌ట‌న

11 Banks Support : ఎక్క‌డైనా ఒక బ్యాంక్ కుప్ప కూలితే త‌ల్ల‌డిల్లి పోతాం. కానీ అమెరికాలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల దేశంలో విశిష్ట సేవ‌లు అందించిన రెండు బ్యాంకులు దివాళా తీశాయి. తాజాగా రిప‌బ్లిక్ బ్యాంకుకు భ‌రోసా ఇచ్చాయి 11 బ్యాంకులు(11 Banks Support). ఏకంగా 30 బిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించాయి. త‌మ ఉదార‌త‌ను చాటుకున్నాయి. ఆ బ్యాంకు మునిగి పోకుండా ఆయా బ్యాంకులు ముందుకు వ‌చ్చాయి. ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఆస‌రాగా నిలిచాయి.

ఇదిలా ఉండ‌గా అమెరికాలో రోజు రోజుకు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ , సిగ్నేచ‌ర్ బ్యాంకులు ఒడిదుడుకుల‌కు లోన‌వుతున్నాయి. వీటితో పాటు అమెరికాలోని పేరొందిన బ్యాంకులు కూడా కుప్ప కూలేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ఐరోపా లోని క్రెడిట్ సూయిజ్ దివాళా తీసే స్థితికి చేరుకుంది.

ఈ మొత్తం వ్య‌వ‌హారం 2008లో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం గుర్తుకు తెచ్చేలా చేస్తోంది. దీంతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ఇక ఫ‌స్ట్ రిప‌బ్లిక్ బ్యాంకులో మొత్తం 176 బిలియ‌న్ డాల‌ర్ల డిపాజిట్లు ఉన్నాయి.

మొన్న‌టికి మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంకు కుప్ప కూలింది. దీని ఎఫెక్ట్ తో యుఎస్ లోని ఇత‌ర బ్యాంకుల‌లో ఉన్న ఖాతాదారులంతా త‌మ డాల‌ర్ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు దివాలా తీసే బాట‌లో ఉండ‌డం విషాద‌క‌రం.

Also Read : ఒత్తిళ్ల‌ను త‌ట్టుకునే స్థితిలో భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!