19 Labourers Missing : చైనా స‌రిహ‌ద్దులో కార్మికులు మిస్సింగ్

19 మంది భార‌త కార్మికుల కోసం వేట

19 Labourers Missing : భార‌త్ లోని అరుణాచ‌ల్ లోని భార‌త్ – చైనా స‌రిహ‌ద్దు స‌మీపంలో 19 మంది కార్మికులు(19 Labourers Missing) మంగ‌ళ‌వారం తప్పిపోయారు. కుమే న‌దిలో ఒక కార్మికుడి మృత‌దేహాన్ని వెలికి తీసిన‌ట్లు స‌మాచారం.

కానీ ఇంకా ధ్రువీక‌రించాల్సి ఉంది భార‌త సైన్యం. చైనాతో ఉన్న ఎల్ఏసీ ప్రాంతంలోని చివ‌రి స‌ర్కిల్ డామిన్ నుండి దాదాపు 80 కిలోమీట‌ర్ల దాకా ఉంది.

గౌహ‌తి లోని స‌రిహ‌ద్దు ర‌హ‌దారి నుండి రెండు వారాల కింద‌ట తప్పి పోయిన కార్మికుల బృందాన్ని కొనుగోనేందుకు సైన్యం రంగంలోకి దిగింది.

కురుంగ్ కుమే జిల్లాలో చైనాతో ఉన్న వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ నుండి చాలా దూరంలో లేదు. డామిన్ స‌ర్కిల్ అనేది నిర్మాణ స్థ‌లం.

ఈ ప్ర‌దేశం రాష్ట్ర రాజ‌ధాని ఇటాన‌గ‌ర్ నుండి దాదాపు 300 కి.మీ. అస్సాం నుండి వ‌చ్చిన 19 మంది వ‌ల‌స కార్మికులు ప‌ని చేస్తున్న కాంట్రాక్ట‌ర్ త‌ప్పి పోయారంటూ ఫిర్యాదు చేశాడు.

జూలై 5న డామిన్ స‌ర్కిల్ లోని బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ (బీఆర్ఓ) ర‌హ‌దారి నిర్మాణ స్థలంలో కార్మికులు లేబ‌ర్ క్యాంపుల నుండి పారి పోయారు.

గ‌త వారం ఈద్ అల్ అదాను జ‌రుపుకునేందుకు అస్సాంలోని వారి ఇళ్ల‌కు తిరిగి వెళ్లేందుకు కాంట్రాక్ట‌ర్ సెల‌వు ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. జూలై 13న స్థానిక పోలీస్ స్టేష‌న్ లో మిస్సింగ్ రిపోర్టు దాఖ‌లు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా అస్సాం లోని ల‌ఖింపూర్ కు చెందిన స‌బ్ కాంట్రాక్ట‌ర్ పై మ‌రో కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Also Read : అజారుద్దీన్ ఓ నియంత అక్ర‌మాల పుట్ట

Leave A Reply

Your Email Id will not be published!