National Flag : అమ్మ‌కానికి 20 కోట్ల జాతీయ జెండాలు

వెల్ల‌డించిన కేంద్ర సాంస్కృతిక శాఖ

National Flag : దేశంలో మోదీ బీజేపీ ప్ర‌భుత్వం కొలువు తీరాక వ్యాపారం మూడు పూలు ఆరు కాయ‌లుగా విరాజిల్లుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్మే ప‌నిలో ప‌డ్డారు.

ఇక దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచిన జాతీయ జెండాల‌ను(National Flag)  కూడా ఎలా అమ్మ‌కానికి పెట్ట‌వ‌చ్చో చెబుతున్నారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరుతో దేశ వ్యాప్తంగా జాతీయ వాదాన్ని పెంపొందించేందుకు గాను ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాన మంత్రి మోదీ.

ఇంకేం ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాలు త‌మ రేష‌న్ దుకాణాల‌లో రేష‌న్ దారులకు రూ. 20 చొప్పున జాతీయ జెండాల‌ను అమ్మాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

హ‌ర్యానా లోని క‌ర్నాల్ లో రేష‌న్ దారుల‌కు డీల‌ర్ షాక్ ఇచ్చాడు. జెండా కొంటేనే రేష‌న్ ఇస్తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ నిప్పులు చెరిగాడు.

ఈ దేశంలో జెండా లేదు రేష‌న్ లేదు అంటూ మండిప‌డ్డాడు. రాహుల్ గాంధీ అయితే జాతీయ వాదం పేరుతో ఆఖ‌రుకు భార‌తీయ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని కూడా అమ్మకానికి పెట్టిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు.

ఇక భార‌తీయ పోస్ట‌ల్ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్ లైన్ లో కోటికి పైగా త్రివ‌ర్ణ ప‌తాకాల‌ను(National Flag)  విక్ర‌యించింది. తాజాగా మ‌రో 20 కోట్ల జాతీయ జెండాలు అమ్మ‌కానికి ఉన్నాయంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్వాతంత్రం పేరుతో జెండాల‌ను కూడా ఇలా అమ్మ‌వ‌చ్చంటూ మోదీని ఎద్దేవా చేస్తున్నాయి ప్ర‌తిపక్షాలు.

Also Read : త్రివ‌ర్ణ ప‌తాకం అంగట్లో స‌రుకు కాదు

Leave A Reply

Your Email Id will not be published!