LIC : ఎల్ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐల‌కు ఓకే

ఆమోదించిన మోదీ ప్ర‌భుత్వం

LIC : దేశంలోనే కాదు జీవిత బీమా రంగంలో ప్ర‌పంచంలోనే టాప్ లో ఉన్న భార‌తీయ జీవిత బీమా సంస్థ (LIC )కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఎప్ప‌టి నుంచో మోదీ కేంద్రంలో కొలువు తీరాక ఉన్న సంస్థ‌ల‌ను, ఆస్తుల‌ను అమ్మ‌డం త‌ప్ప ఏ ఒక్క‌టి తీసుకు వ‌చ్చింది లేదు.

పాత వాటికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రాలేదు. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే బ్యాంకుల‌పై నియంత్ర‌ణ కోల్పోయింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.

ఈ దేశంలో పాల‌న అన్న‌ది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంది. కేవ‌లం కొద్ది మంది వ్యాపార‌వేత్త‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే మోదీ ప్ర‌ధాన మంత్రి అయ్యారన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌తిప‌క్షాలు నెత్తి నోరు బాదుకున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అత్యంత లాభాల బాట‌లో న‌డుస్తున్న ఎల్ఐసీని(LIC )ప్రైవేట్ ప‌రం చేసే ప‌నిలో పడింది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ సాక్షిగా విప‌క్షాలు పెద్ద ఎత్తున అభ్యంత‌రం తెలిపాయి.

ఇదే స‌మ‌యంలో వ‌ద్ద‌న్నా ముందుకే క‌దిలింది మోదీ ప్ర‌భుత్వం. ఎల్ఐసీలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ఓకే చెప్పింది.

భార‌త దేశాన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన పెట్టుబ‌డి గ‌మ్య స్థానంగా మార్చేందుకు దాని ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూ ప్ర‌స్తుత పాల‌సీని మ‌రింత స‌ర‌ళీకృతం చేయ‌డంతో ఎల్ఐసీ లో ఎఫ్‌డీఐల‌ను ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు ఆమోదించ బ‌డింది.

ఆటోమేటిక్ రూట్ లో ప్ర‌స్తుతం 20 శాతం వ‌ర‌కు అనుమ‌తిస్తారు. న‌వీక‌రించ బ‌డిన, స్థిర‌మైన , సుల‌భంగా అర్థ‌మ‌య్యే ఎఫ్డీఐ ఫ్రేమ్ వ‌ర్క్ ను అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంది కేంద్ర స‌ర్కార్.

  Also Read : ఐకియా ఇండియా సిఇఓగా సుసానే

Leave A Reply

Your Email Id will not be published!