Shopian Encounter : జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్
ముగ్గురు ఉగ్రవాదులు ఖతం
Shopian Encounter : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోషియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య భీకర పోరు కొనసాగింది. ఉగ్రవాదులు భారత బలగాలపై కాల్పులకు(Shopian Encounter) తెగబడ్డారు. దీంతో జవాన్లు కాల్పులు జరిపారు.
ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. గత కొంత కాలంగా వారి ఉనికి అంతంత మాత్రంగానే ఉండడంతో దాడులకు తెగబడ్డారు. ప్రధానంగా బతికేందుకు జమ్మూ కాశ్మీర్ కు వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఇప్పటికే పలువురు పిండిట్లను కాల్చి చంపారు. మరో వైపు భారత ఆర్మీ వాహనంపై దాడికి(Shopian Encounter) పాల్పడ్డారు. దీంతో భారత ఆర్మీ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ పై ఫోకస్ పెట్టింది. మరో వైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా దూకుడు పెంచుతోంది. ఈ తరుణంలో భారత సైనిక దళాలు మరింత అప్రమత్తం అయ్యాయి.
ఇదే సమయంలో దర్యాప్తు ముమ్మురం చేస్తుండగా ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్నారు. భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఆ వెంటనే చుట్టు ముట్టాయి. లొంగి పోవాలని కోరాయి. కానీ ఉగ్రవాదులు పట్టించు కోలేదు.
ఆపై భారత బలగాలపై దాడులకు తెగబడ్డాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మన వాళ్లు పై చేయి సాధించారు. ముగ్గురిని అక్కడికక్కడే మట్టు బెట్టారు.
Also Read : పాకిస్తాన్ ను పరిగణలోకి తీసుకోం – జై శంకర్