Odisha Train Accident : మూడు నిమిషాల్లో మూడు రైళ్లు ఢీ
ఒడిశాలో రైలు ప్రమాదం ఎలా జరిగింది
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంతో(Train Accident) ఒక్కసారిగా యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 237 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తే దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి.
కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్నాయి. అధికారులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకుంది. ఈ ఘటన సరిగ్గా సాయంత్రం 6.50 నుండి రాత్రి 7.10 గంటల లోపు చోటు చేసుకుంది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది రైల్వే శాఖ. ఈ మేరకు విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా కోరమాండల్ షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఇదే సమయంలో యశ్వంత్ పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ మరో రైలు పట్టాలు తప్పిన కోచ్ ల పైకి దూసుకు వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకు పోయి ఉంటారని భావిస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ. చాలా మంది ప్రయాణీకులు నిద్రిస్తున్నారు. చెన్నైకి వెళుతోంది కోరమాండల్ రైలు. గూడ్స్ రైలును ఢీకొనడంతో కోచ్ లు బోల్తా పడ్డాయి. ఢీకొన్న సమయంలో రెండు రైళ్లు అతి వేగంతో వెళుతున్నాయి.
Also Read : Train Accidents India