Train Accidents India : దేశ చ‌రిత్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదాలు

1981లో బీహార్ లో 500 మంది దుర్మ‌ర‌ణం

Train Accidents India : ఒడిశా లోని బాలాసోర్ జిల్లాలో జ‌రిగిన కోర‌మాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదంలో(Train Accident) ఇప్ప‌టి వ‌ర‌కు 237 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇచ దేశ చ‌రిత్ర‌లో అత్యంత ఘోర‌మైన ప్ర‌మాదాల‌లో ఇది కూడా ఒక‌టి కావ‌డం గ‌మనార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌మాదాల వివ‌రాలు చూస్తే 1981లో బీహార్ లోని స‌హ‌స్ర వ‌ద్ద ఓ ప్యాసింజ‌ర్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. భాగ‌మ‌తి న‌దిలో ప‌డి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో 500 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు.

1995లో ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ఫీరోజాబాద్ వ‌ద్ద ఢిల్లీకి వెళుతున్న పురుషోత్త‌మ్ ఎక్స్ ప్రెస్ క‌లిండ్ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

1999లో అసోం లోని గైసోల్ వ‌ద్ద రెండు ప్యాసింజ‌ర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 290 మంది చ‌ని పోయారు. ప్ర‌మాద తీవ్ర‌త దెబ్బ‌కు పేలుడు కూడా సంభ‌వించింది. ఆ చుట్టు పక్క‌ల ప్రాంతాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాయి.

ఇక 1998లో కోల్ క‌తా వెళుతున్న జ‌మ్మూ తావి ఎక్స్ ప్రెస్ ఖ‌న్నా – లుధియానా సెక్ష‌న్ లో ప‌ట్టాలు త‌ప్పింది. అక్క‌డే ఉన్న గోల్డెన్ టెంపుల్ ఎక్స్ ప్రెస్ రైలు(Train) బోగీల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజ‌ధాని ఎక్స్ ప్రెస్ ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 140 మంది అక్క‌డిక‌క్క‌డే చ‌ని పోయారు.

2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోక‌మాన్య తిల‌క్ జ్ఞానేశ్వ‌రి ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు వ‌ల్ల ప‌ట్టాలు త‌ప్పింది. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో 170 మందికి పైగా చ‌ని పోయారు.

2016లో ఇండోర్‌ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌ సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదంలో 150 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు(Train) వంతెన కొట్టుకు పోవడంతో ఓ డెల్టా పాసింజర్‌ రైలు పట్టాలు తప్పడంతో 114 మంది దుర్మరణం చెందారు.

తాజాగా 2023లో ఒడిశాలోని బాలాసోర్ లో జ‌రిగిన కోర‌మాండ‌ల్ దుర్ఘ‌ట‌న‌లో 237 మందికి పైగా చ‌ని పోయారు.

Also Read : CM YS Jagan

Leave A Reply

Your Email Id will not be published!