AP CM YS Jagan : ఉద్యోగినులకు ఏపీ సర్కార్ తీపి కబురు
5 ప్రత్యేక సాదారణ సెలవులు మంజూరు
AP CM YS Jagan : సీఎం జగన్ సారథ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని వర్గాల ప్రజలను మెస్మరైజ్ చేసే పనిలో పడింది. ఇక ఉద్యోగులు కీలకం కానున్నారు. ఇందులో భాగంగా సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏడాదిలో 5 ప్రత్యేక సాదారణ సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొదట రెగ్యులర్ కింద పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం ఉండేది.
కానీ ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీలోని ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ కింద పని చేస్తున్న ప్రతి మహిళా ఉద్యోగికి ఈ 5 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు వర్తింప చేస్తున్నట్లు సీఎం జగన్ రెడ్డి(AP CM YS Jagan) తెలిపారు. ఇది పూర్తిగా ఏపీ మహిళలకు ప్రత్యేకమని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి జీవో నంబర్ 39 జారీ చేసింది. అయితే తమకు కూడా 5 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు వర్తింప చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు మహిళా ఉద్యోగినులు సీఎంకు దరఖాస్తు చేసుకున్నారు. మానవతా దృక్ఫథంతో పరిశీలించిన సీఎం ఓకే చెప్పారు. ప్రస్తుతం జగన్ రెడ్డికి మహిళా ఉద్యోగినులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : దేశంలో కొత్తగా 7,890 కరోనా కేసులు