Covid19 : దేశంలో 7,533 కొత్త కేసులు 44 మ‌ర‌ణాలు

పెరుగుతున్న కేసుల‌తో ప‌రేషాన్

Covid19 : దేశంలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతోంది. రోజు రోజుకు 7 వేల‌కు పైగానే కొత్త‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో 7,533 కొత్తగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా(Covid19) కార‌ణంగా దేశంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేటి దాకా చూస్తే మ‌ర‌ణాల సంఖ్య 5,31,468కి పెరిగింది. కేర‌ళ‌లో 16 మంది చ‌ని పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇక యాక్టివ్ కోవిడ్ కేసులు 53,852కి త‌గ్గాయి.

ఇక పెరిగిన కేసులతో క‌లుపుకుంటే మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 4 కోట్ల 49 ల‌క్ష‌ల‌కు చేరింది. క్రియాశీల కేసులు ఆశించిన దాని కంటే త‌గ్గిన‌ట్లు కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయ‌ని తెలిపింది.

మొత్తం ఇన్ఫెక్ష‌న్ ల‌లో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.69 శాతంగా న‌మోదైంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,45,47,024కి చేరుకుంంది. మ‌ర‌ణాల రేటు1.18 శాతంగా న‌మోదైంది.

Also Read : ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు

Leave A Reply

Your Email Id will not be published!