Sanju Samson Dhoni : ధోనీకి సంజూ శాంస‌న్ సెల్యూట్

మ‌న‌సు దోచుకున్న రాజస్థాన్ స్కిప్ప‌ర్

Sanju Samson Dhoni : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజ‌న్ లో అరుదైన స‌న్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా హాట్ టాపిక్ గా మారారు ఇద్ద‌రు కెప్టెన్లు. వారెవ‌రో కాదు మోస్ట్ పాపుల‌ర్ స్కిప్ప‌ర్ జార్ఖండ్ ఢైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కాగా మ‌రొక‌రు కూల్ కెప్టెన్ గా పేరు పొందిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. ఇద్ద‌రూ క‌లిస్తే ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

స్వంత మైదానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆడ‌డం అడ్వాంటేజ్ కాగా ఊహించ‌నిరీతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ 32 ర‌న్స్ తో ఓడి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 202 ర‌న్స్ చేస్తే సీఎస్కే 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 170 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఇక రాజ‌స్థాన్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు. ఆ జ‌ట్టు ఐపీఎల్ లీగ్ లో 200వ మ్యాచ్ ఆడుతోంది. ఈ సంద‌ర్భంగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టారు రాజ‌స్థాన్ ఆట‌గాళ్లు.

మ్యాచ్ కు ముందు మ్యాచ్ గెలుపొందిన త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ హాట్ టాపిక్ గా మారాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాక తాను ప్రేమించే అరుదైన నాయ‌కుడు మ‌హేంద్ర సింగ్ ధోనీతో క‌ర‌చాల‌నం చేశాడు. థ్యాంక్యూ స‌ర్ అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాడు సంజూ శాంస‌న్. ఇవాళ స్టేడియం గులాబీ రంగుతో పాటు పసుపు రంగు కూడా ప్ర‌భావితం చేస్తోంద‌ని చెప్పాడు.

Also Read : ర‌న్స్ కోసం కాదు జ‌ట్టు కోసం ఆడ‌తాడు

Leave A Reply

Your Email Id will not be published!