ICC ODI Rankings : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో బుమ్రా టాప్

టాప్ -10లో నెంబ‌ర్ వ‌న్ మ‌నోడు

ICC ODI Rankings : భార‌త స్టార్ బౌల‌ర్ గా పేరొందిన జ‌స్ ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు న‌మోదు చేశారు. త‌న కెరీర్ లో అత్యుత్త‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఏకంగా టాప్ లో నిలిచాడు. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే బౌలింగ్ ర్యాంకింగ్స్(ICC ODI Rankings)  ప్ర‌క‌టించింది.

ఇంగ్లండ్ టూర్ లో భాగంగా భార‌త జ‌ట్టు రీ షెడ్యూల్, ఐదో టెస్టులో అద్భుతంగా రాణించింది. కానీ ఇంగ్లండ్ బ్యాట‌ర్ల దెబ్బ‌కు ఓటమి

మూట‌గట్టుకుంది. కానీ టి20 సీరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.

అంతే కాకుండా మూడు వ‌న్డే సీరీస్ లో భాగంగా జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. స్టార్ బౌల‌ర్

జ‌స్ ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టెస్టు లోనూ, టి20 మ్యాచ్ ల‌తో పాటు తొలి వ‌న్డేలో దుమ్ము రేపాడు.

కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 6 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. దీంతో ప్ర‌పంచ క్రికెట్ లో వ‌న్డేల ప‌రంగా బౌల‌ర్ల‌లో గ‌ణ‌నీయంగా పాయింట్లు సాధించాడు. టాప్ 10 బౌల‌ర్ల‌లో నెంబ‌ర్ 1 గా నిలిచాడు జ‌స్ ప్రీత్ బుమ్రా.

మొత్తం 718 పాయింట్లు ద‌క్కాయి. అయితే మొత్తం 10 మంది బౌల‌ర్ల‌లో బుమ్రా ఒక్క‌డే భార‌త బౌల‌ర్. మిగ‌తా వాళ్లు ద‌రి దాపుల్లోకి రాక

పోవ‌డం గ‌మ‌నార్హం.

ర్యాంకుల ప‌రంగా చూస్తే టాప్ లో జ‌స్ ప్రీత్ నిలిస్తే కీవీస్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానం ద‌క్కించు కోగా మూడో ప్లేస్ లో పాకిస్తాన్ కు

చెందిన షాహిన్ అఫ్రిది నిలిచాడు.

నాలుగో స్థానంలో ఆసిస్ బౌల‌ర్ జోష్ హాజిల్ వుడ్ , ఐదో ప్లేస్ లో ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన‌ ముజీబ్ ఉర్ రెహ‌మాన్ , 6వ స్థానంలో బంగ్లాదేశ్ కు

చెందిన మెహ‌దీ హ‌స‌న్ నిలిచారు.

ఏడో స్థానంలో ఇంగ్లండ్ కు చెందిన బౌల‌ర్ క్రిస్ వోక్స్ , 8వ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన మ్యాట్ హెన్రీ, ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన నబీ,

ర‌షీద్ ఖాన్ వ‌రుస‌గా 9, 10 స్థానాల్లో నిలిచారు.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-3లో ఇండియా

Leave A Reply

Your Email Id will not be published!