Chamika Karunaratne : పెట్రోల్ లేక క్రికెట్ ప్రాక్టీస్ బంద్ – చ‌మిక

శ్రీ‌లంక క్రికెట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Chamika Karunaratne : శ్రీ‌లంక‌లో సంక్షోభం ఇంకా స‌మ‌సి పోలేదు. 1948 లో ఆ దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత ఎన్న‌డూ లేని రీతిలో ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్, విద్యుత్, గ్యాస్ సంక్షోభంతో త‌ల్ల‌డిల్లుతోంది.

పెట్రోల్, డీజిల్ కోసం వేలాది మంది జ‌నం నెల‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే ప‌డిగాపులు కాస్తున్నారు. మ‌రో వైపు మాజీ శ్రీ‌లంక క్రికెట‌ర్ రోష‌న్ మ‌హ‌నామా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో బాధితుల‌కు బ్రెడ్లు, టీ అంద‌జేశారు.

ఇదే స‌మ‌యంలో లంకేయులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చారు. దేశం సంక్షోభానికి ప్ర‌ధాన కార‌ణం దేశ అధ్యక్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే, ప్ర‌ధాని మ‌హీంద రాజ‌ప‌క్సే కుటుంబం అంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు.

ప్ర‌జాగ్రహానికి త‌లవంచ‌క త‌ప్ప‌లేదు గోట‌బ‌య‌. రాజ భ‌వ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆందోళ‌న‌కారులు. దీంతో ముందే దాడి చేస్తార‌ని గ్రహించిన గోట‌బ‌య రాజ‌ప‌క్సే త‌న ఫ్యామిలీ, సెక్యూరిటీతో మాల్దీవుల‌కు చెక్కేశాడు.

అక్క‌డ సేఫ్ కాద‌ని సింగ‌పూర్ కు మ‌కాం మార్చాడు. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ప్ర‌ధాని ఇంటి ముట్ట‌డించ‌డంతో మ‌హీంద రాజ‌ప‌క్సే రాజీనామా చేసి చంపేస్తారేమోనంటూ నేవీ, ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు.

రాజ‌ప‌క్సే ఫ్యామిలీ ఎవ‌రూ కూడా దేశం విడిచి వెళ్ల కూడ‌దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక దేశానికి చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నే(Chamika Karunaratne) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

పెట్రోల్, డీజిల్ లేక పోవ‌డంతో తాను ప్రాక్టీస్ చేసేందుకు వెళ్ల‌డం లేదంటూ వాపోయాడు. రెండు రోజుల పాటు ఇంధ‌నం కోసం క్యూలో ఉంటే దొరికింద‌ని ఇది లంక‌లో చోటు చేసుకున్న సంక్షోభం ఎలా ఉందో తెలుస్తుంద‌న్నారు.

Also Read : లాంగ్ జంప్ లో ఫైన‌ల్ కు చేరిన శ్రీ‌శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!