PV Sindhu : సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్ కు చేరిన సింధు

సెమీ ఫైన‌ల్ లో సైనా క‌వాక‌మి ఓట‌మి

PV Sindhu : భార‌తీయ స్టార్ ష‌ట్ల‌ర్ , తెలుగు వారి అమ్మాయి పీవీ సింధు సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్ కు చేరుకుంది. సెమీ ఫైన‌ల్స్ లో సైనా క‌వాక‌మిని ఓడించింది. శ‌నివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీ ఫైన‌ల్ లో పీవీ సింధు ఈ ఘ‌న‌త సాధించింది.

ఓపెన్ టైటిల్ పోరులో దిగువ ర్యాంక‌ర్ అయిన జ‌ప‌నీస్ కు చెందిన షట్ల‌ర్ సైనా క‌వాక‌మిపై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ ఏడాది స‌య్య‌ద్ మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్ , స్విస్ ఓపెన్ ల‌లో రెండు సూప‌ర్ 300 టైటిళ్ల‌ను క్లెయిమ్ చేసిన డ‌బుల్ ఒలింపిక్ ప‌తక విజేత సింధు 30 నిమిషాల‌లోనే ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టి క‌రిపించింది.

నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ సెమీ ఫైన‌ల్ పోరులో పీవీ సింధు(PV Sindhu) 21-15, 21-7 వ‌రుస సెట్ల‌తో జ‌పాన్ షెట్ల‌ర్ ను ఓడించింది. ఇదిలా ఉండ‌గా 2022 సీజ‌న్ లో త‌న తొలి సూప‌ర్ 500 టైటిల్ కు పీవీ సింధు ప్ర‌స్తుతం ఒక విజ‌యం (అడుగు) దూరంలో ఉంది.

కాగా 2018లో చైనా ఓపెన్ లో చివ‌రి సారిగా ఆడింది సింధు. అయితే హెడ్ టు హెడ్ రికార్డుతో త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంది. మాజీ ప్ర‌పంచ ఛాంపియ‌న్ నంబ‌ర్ 38 క‌వాకామికి వ్య‌తిరేకంగా సింధు పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

బ‌ల‌మైన షాట్స్ కు బెంబేలెత్తి పోయింది ప్ర‌త్య‌ర్థి. ఇక ఆట ప్రారంభం నుంచే సింధు(PV Sindhu) ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చింది. ఎక్క‌డా ఆడేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఒక వేళ ఈ టైటిల్ గెలిస్తే మ‌రో రికార్డు సాధిస్తుంది సింధు.

Also Read : పెట్రోల్ లేక క్రికెట్ ప్రాక్టీస్ బంద్ – చ‌మిక

Leave A Reply

Your Email Id will not be published!