Rupee Collapse : మరోసారి డీలా పడిన రూపాయి
అమెరికా డాలర్ కి రూ. 80
Rupee Collapse : అంతర్జాతీయ పరంగా మార్కెట్ లో మరింత బలహీన పడింది భారతీయ రూపాయి. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కొలువు తీరాక ఈ ఎనిమిదేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రూపాయి పతనం వరుసగా కొనసాగుతూ వస్తోంది.
ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ట్రేడర్ల ప్రధాన దృష్టి సెంట్రల్ బ్యాంక్ సమావేశాలకు చేరుకోవడంతో రూపాయి మంగళవారం మొదటిసారిగా డాలర్ కు 80ని తాకింది.
విచిత్రం ఏమిటంటే భారతీయ ఆర్థికవేత్తలు మరింత ఆందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా రూపాయి పతనం(Rupee Collapse) మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
గత కొన్ని రోజుల నుంచీ మార్కెట్ లో తీవ్ర ప్రభావానికి లోనవుతూ వస్తోంది రూపాయి. బ్లూమ్ బెర్గ్ 79,9863 వద్ద ప్రారంభమైన తర్వాత గ్రీన్ బ్యాక్ తో పోలిస్తే రూపాయి చివరిగా 80.0163 వద్ద ఉందని ఇంట్రా – డే రికార్డు కనిష్ట స్థాయి 80.017ని తాకింది.
ప్రారంభ ట్రేడింగ్ లో యుఎస్ డాలర్ తో రూపాయి ఆల్ టైట్ కనిష్ట స్థాయి 80. 05 వద్ద నిలిచింది. కిందటి ముగింపుతో పోలిస్తే 7 పైసల లాభంతో కోట్ చేసింది. దీని ప్రభావం దెబ్బకు అన్ని రంగాలపై పడనుంది.
గత ఏడు సెషన్లలో ఆరింటిలో రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో భారత్ కరెన్సీ ఈ ఏడాది 7 శాతానికి పైగా పడి పోయింది.
ఈ ఏడాది దేశం నుండి విదేశీ నిధుల ప్రవాహాలు గత రెండేళ్లలో కలిపి వచ్చిన ఇన్ ఫ్లోల కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఏడాది భారతీయ ఆస్తుల నుండి విదేశీ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో $29 బిలియన్లను వెనక్కి తీసుకున్నారు. ఇది కూడా ప్రభావం చూపింది రూపాయిపై.
Also Read : భవిష్యత్తు వర్చువల్ టెక్నాలజీదే