Modi & Achinta Sheuli : అచింత షయొలీకి మోదీ అభినందన
బంగారు పతకాల విజేతలకు కంగ్రాట్స్
Modi & Achinta Sheuli : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు ఆరు పతకాలు మన దేశం ఖాతాలో జమ అయ్యాయి.
వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ముగ్గురు వెయిట్ లిఫ్టర్లు పసిడి పతకాలు సాధించారు. మీరా భాయి చాను, గెరెమితో పాటు అచింత షెయులీ గోల్డ్ మెడల్స్ కొట్టారు.
ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి పతక విజేతలను అభినందించారు. ప్రత్యేకంగా ప్రశంసించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరు సాధించిన ఈ పతకాలు దేశానికి గర్వ కారణంగా నిలిచాయని , భారత పతాకం సమున్నతంగా ఎగిరేలా చేసినందుకు మీకు అభినందనలు అంటూ తెలిపారు.
అచింత షెయులీ గోల్డ్ మెడల్ సాధించాక అతడికి సినిమా చూసేందుకు సమయం లభిస్తుందని వ్యాఖ్యానించారు మోదీ. అచింత సాధించిన బంగారు పతకంతో భారత్ ఒడిలో ఆరు పతకాలు చేరాయి.
ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi) అచింత షెయులీతో(Achinta Sheuli) సంభాషించిన వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల విభాగంలో 73 కేజీల ఫైనల్లో పసిడి కైవసం చేసుకున్నాడు అజింత షెయులీ.
నువ్వు పతకాన్ని సాధించడం గర్వంగా ఉంది. ప్రశాంత స్వభావానికి , మొండితనానికి ప్రసిద్ది. ఈ విజయం కోసం ఎంతో కష్టపడ్డాడు. అతడి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
బంగారు పతకాలు సాధించిన విజేతలను చూసి యావత్ దేశం గర్విస్తోందని తెలిపారు ప్రధాన మంత్రి.
Also Read : మంధాన మెస్మరైజ్ ఇన్నింగ్స్ సర్ ప్రైజ్
Before our contingent left for the Commonwealth Games, I had interacted with Achinta Sheuli. We had discussed the support he received from his mother and brother. I also hope he gets time to watch a film now that a medal has been won. pic.twitter.com/4g6BPrSvON
— Narendra Modi (@narendramodi) August 1, 2022