Akkineni Naga Chaitanya : విడాకుల‌పై నాగ చైత‌న్య కామెంట్స్

ఇద్ద‌రం విడి పోవాల‌ని అనుకున్నాం

Akkineni Naga Chaitanya : అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని నాగ చైత‌న్య మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు న‌టి స‌మంత‌కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని కానీ విడి పోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

విడాకుల గురించి ప్ర‌పంచానికి తెలియాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మంత త‌నంత‌కు తాను విడి పోవాల‌ని కోరింది. దానికి నేను ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని పేర్కొన్నారు నాగ చైత‌న్య‌.

త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి స్పందించాడు. స‌మంత‌, నాగ చైత‌న్య(Akkineni Naga Chaitanya) క‌లిసి గ‌త ఏడాది సంయుక్త ప్ర‌క‌ట‌న చేశారు. తాము విడి పోతున్న‌ట్లు తెలిపారు. ఏది పంచుకోవాలో ఏది పంచుకోకూడ‌దో త‌న‌కు తెలుస‌న్నారు.

ఊహాగానాలు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ప్ర‌శంస‌ల‌ను తాను ప‌ట్టించుకోన‌ని పేర్కొన్నారు. కుటుంబం అన్న‌ది ముఖ్యం. ఇవ‌న్నీ తాత్కాలిక‌మే. జ‌రిగింది మన మంచికే. జ‌ర‌గ బోయేది కూడా మంచికే అన్న దానిపై తాను ఎక్కువ‌గా ఆధార ప‌డ‌తాన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం త‌న కెరీర్ సాఫీగా సాగుతోంద‌న్నారు. ప‌లు సినిమాల‌లో న‌టిస్తుండ‌డంతో బిజీగా మారాన‌ని తెలిపారు నాగ చైత‌న్య‌. చాలా మటుకు ఏకాంతంగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

ఏకాంతం ఇచ్చేంత ఆనందం, సంతోషం ఇంకేదీ ఇవ్వ‌ద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హిస్తున్న ప్రోగ్రాంలో స‌మంత రుతు ప్ర‌భు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

నాగ చైత‌న్య త‌న‌కు భ‌ర్త కాద‌ని మాజీ భ‌ర్త అని పేర్కొనడం క‌ల‌క‌లం రేగింది.

Also Read : శివుడి సాంగ్ పై గుస్సా సింగ‌ర్ పై ఫ‌త్వా

Leave A Reply

Your Email Id will not be published!