Telangana Comment : సకల నేరాలకు అడ్డా తెలంగాణ గడ్డ
మద్యం..మాఫియా..డ్రగ్స్..రేప్ లు..మర్డర్లు
Telangana Comment : వేలాది మంది బలిదానాలు, ఆత్మ త్యాగాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇప్పుడు సకల నేరాలకు అడ్డాగా మారడం బాధాకరం. ఒకటా రెండా ప్రతి నేరానికి అభాగ్యనగరం అడ్రస్ కావడం చర్చకు దారి తీసింది.
మద్యం వరదల కంటే ఎక్కువగా పారుతోంది. గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి చోటా వైన్స్ షాప్ దర్శనమిస్తోంది. కొన్నింటికే పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు అంతటా వ్యాపించింది.
24 గంటలు యధేశ్చగా నడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక కిడ్నాప్ లు, మర్డర్లు, అత్యాచారాలు, దోపిడీలు, రియల్ ఎస్టేట్ దందాలు, పేకాట నేరగాళ్లు, లంగలు, లఫంగలు, కుండాకోర్లు, దగుల్బాజీ నాయాళ్లకు అడ్డాగా మారింది.
నోరు విప్పితే సుద్దులు చెప్పే సీఎం ఫామ్ హౌస్ లో పండుకుంటే పాలన గాడిన పడుతుందా. ఒకరు ట్విట్టర్ పిట్ట. ఇంకొకరు మాటల మయాల మరాఠి.
అధికారం చేతిలో ఉంది కదా అని ఎడా పెడా ఢిల్లీలో మకాం వేస్తే సమస్యలు తీరుతాయా. జవాబుదారీ లేదు. బాధ్యత అంతకన్నా లేదు. లెక్కలేనన్ని నేరాలు రోజు రోజుకు నమోదవుతున్నాయి.
జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఓ నేరస్థుడుగా తయారయ్యేలా చేస్తోంది సర్కార్. బాధ్యతల నుంచి తప్పుకుని జల్సా రాయుళ్లకు మద్దతు పలుకుతుంటే ఇక ప్రజాస్వామ్యం ఉందని ఎలా అనుకోగలం.
ఇకనైనా ప్రజలు మారాలి. తప్పు చేసిన వాళ్లను జనం చంపేసే రోజు రావాలి. అప్పుడే తెలంగాణ(Telangana Comment) బాగు పడుతుంది. లేకపోతే వల్లకాడు అవుతుంది.
Also Read : తుపాకికి తుపాకీతోనే సమాధానం చెప్పాలి