Vijaya Sai Reddy : ద్రవ్యోల్బణం దేశానికి అత్యంత ప్రమాదం
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆవేదన
Vijaya Sai Reddy : దేశంలో రోజు రోజుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. మంగళవారం నిత్యావసర ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన పాల్గొన్నారు.
ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్లు తాము భావిస్తున్నామన్నారు. ప్రజల కొనుగోలు శక్తి నశిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.
ఓ వైపు నిత్యం ప్రజలు వాడే సరుకులు మరో వైపు అత్యవసరంగా మారిన పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరా భారం మోయలేని విధంగా తయారయ్యాయని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి, కేబినెట్ వెంటనే దీనిపై పునరాలోచించాలని ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయ సాయి రెడ్డి.
దేశంలో అనిశ్చితి ఏర్పడితే దానిని తట్టుకోవడం కష్టం అవుతుందన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆర్థిక రంగంలో పేరొందిన నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎంపీ.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సామాజిక, ఆర్థిక రక్షణ పూర్తిగా కేంద్రంపై ఉంటుందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. కరోనా దెబ్బకు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా ధరలను ఎడా పెడా ముందు వెనుకా చూసుకోకుండా పెంచడం వల్ల చివరకు నష్ట పోయేది ప్రజలేనని దాని వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు.
కేంద్రం తన మొత్తం పన్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత ఏడు సంవత్సరాలలో ఏపీ రాష్ట్రం 46 వేల కోట్ల రూపాయలు నష్ట పోయిందని వాపోయారు విజయ సాయి రెడ్డి(Vijaya Sai Reddy).
Also Read : వీఆర్వో వ్యవస్థకు మంగళం సర్వత్రా ఆగ్రహం