CWG 2022 India : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ ప‌త‌కాల వేట‌ 

భార‌త బాక్స‌ర్ నీతు ఘంగాస్ రేర్ రికార్డ్ 

CWG 2022 India :  బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా జ‌రుగుతున్న 22వ కామ‌న్వెల్త్ గేమ్స్ -2022(CWG 2022 India) లో భార‌త్ మ‌రింత దూకుడు పెంచింది. ప‌త‌కాల వేట కొన‌సాగిస్తోంది.

10వ రోజు భార‌త్ ఖాతాలో రెండు స్వ‌ర్ణాలు ద‌క్కాయి. బాక్సింగ్ విభాగంలో అమిత్ పంఘ‌ల్ , నీతూ గంగాస్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. బంగారు ప‌త‌కాలు సాధించారు.

ఇక అమిత్ పంఘ‌ల్ ఇంగ్లండ్ కు చెందన కియార‌న్ మ‌క్ డొనాల్డ్ ను ఓడించి స్వ‌ర్ణం గెలుపొందారు. తెలుగు అమ్మాయి పీవీ సింధు ఫైన‌ల్ లోకి ప్ర‌వేశించింది.

ర‌జ‌త ప‌త‌కం ద‌క్క‌నుంది. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైన‌ల్ జ‌రుగుతోంది. భార‌త్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య సేన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ను ఆడుతున్నాడు.

అంత‌కు ముందు పంఘ‌ల్ , నీతూ గంగాస్ వ‌రుస‌గా పురుషుల ఫ్లై వెయిట్ , మ‌హిళ‌ల మినిమ‌మ్ వెయిట్ విభాగాల‌లో భార‌త్ కు ప‌సిడి పత‌కాల‌ను అందించారు.

అదే స‌మ‌యంలో పీవీ సింధు త‌న సెమీ ఫైన‌ల్ లో వ‌రుస గేమ్ ల‌లో గెలిచి మ‌హిళ సింగిల్స్ ఫైన‌ల్ కు చేరుకుంది. ఇక మ‌హిళ‌ల హాకీలో భార‌త్ షూటౌట్‌లో న్యూజిలాండ్ ను ఓడించి కాంస్య ప‌త‌కాన్ని సాధించింది.

నిఖ‌త్ జ‌రీన్ , సాగ‌ర్ అహ్లావ‌త్ కూడా చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. మ‌రో వైపు మ‌హిళ‌ల క్రికెట్ ఫైన‌ల్లో స్వ‌ర్ణం కోసం ఆస్ట్రేలియాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

ప‌లువురు అథ్లెట్లు ఇంకొన్ని ప‌త‌కాలు సాధించే వేట‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు.  ఇదిలా ఉండ‌గా భార‌త్ కు మ‌రిన్ని ప‌త‌కాలు రావాల్సి ఉంది.

Also Read : పారా టేబుల్ టెన్నిస్ లో ‘భ‌వినా’కు స్వ‌ర్ణం

Leave A Reply

Your Email Id will not be published!