India Win Hockey : హాకీలో భార‌త మ‌హిళా జ‌ట్టుకు కాంస్యం

షూటౌట్ లో న్యూజిలాండ్ కు బిగ్ షాక్

India Win Hockey : బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ -2022లో భార‌త్ స‌త్తా చాటింది. ప‌లు విభాగాల‌లో ప‌త‌కాల వేట కొన‌సాగిస్తోంది.

10వ రోజు కూడా మ‌రికొన్ని ప‌త‌కాలు భార‌త్ జాబితాలో చేరాయి. తాజాగా మ‌హిళ‌ల హాకీలో భార‌త్(India Win Hockey)  న్యూజిలాండ్ ను ఓడించి కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకుంది.

షూటౌట్‌లో ఈ గెలుపు సాధ్య‌మైంది. మ్యాచ్ లో భాగంగా 2-1తో న్యూజిలాండ్ ను ఓడించింది. రెండో క్వార్ట‌ర్ లో స‌లీమా టెటె గోల్ చేయ‌డంతో భార‌త్ ఆధిక్యంలోకి వెళ్లింది.

అయితే మ్యాచ్ ముగిసేందుకు 17 సెక‌న్ల వ్య‌వ‌ధిలో న్యూజిలాండ్ పెనాల్టీ స్ట్రోక్ తో అద్భుత‌మైన గోల్ సాధించంది. దీంతో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు చెరో ఒక గోల్ త్ స‌మానంగా నిలిచాయి.

ఇక ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లో స‌వితా పునియా ఓట‌మి పొందారు. కాగా ఈసారి షూటౌట్‌లో భార‌త్ స‌త్తా చాటింది. 16 ఏళ్ల‌లో కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో మ‌హిళ‌ల హాకీలో భార‌త్ కు ఇది తొలి ప‌త‌కం కావ‌డం విశేషం.

ఇక పురుషుల 10,000 మీట‌ర్ల రేస్ వాక్ లో సందీప్ కుమార్ కాంస్య ప‌త‌కం గెలుపొందాడు. సందీప్ కుమార్ వ్య‌క్తిగ‌త అత్యుత్త‌మ స‌మ‌యంతో కాంస్యం సాధించాడు.

కుమార్ 38:49.21 మీట‌ర్లతో కాంస్య ప‌త‌కం ద‌క్కించుకోగా కెన‌డాకు చెందిన ఇవాన్ డ‌న్నీ బంగారు ప‌త‌కాన్ని పొందాడు. ఆస్ట్రేలియాకు చెందిన డెక్లాన్ టింగ‌య్ 38:42.33 త‌ర్వాతి స్థానంలో నిలిచాడు.

ఇదే స‌మ‌యంలో భార‌త్ కు చెందిన మ‌రో అథ్లెట్ అమిత్ ఖ‌త్రీ 43:04.97 సీజ‌న్ లో ఉత్త‌మ స‌మ‌యంతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

Also Read : ట్రిపుల్ జంప్ లో ‘ఎల్డోస్’ కు స్వ‌ర్ణం

Leave A Reply

Your Email Id will not be published!