Arvind Kejriwal : గుజరాత్ లో గెలిపిస్తే 10 లక్షల కొలువులు
అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. రెండు రోజుల పర్యటన లో భాగంగా గుజరాత్ లో పర్యటించారు సీఎం. ఈ ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). గత 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అధోగతి పాలు చేశారంటూ ఆరోపించారు.
ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు సీఎం. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో తమకు అధికారం అప్పగిస్తే రాష్ట్రంలోని కుటుంబాలందరికీ ఉచితంగా విద్యుత్ అందజేస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు ప్రయారిటీ ఇస్తామన్నారు. మరో సంచలన ప్రకటన చేశారు అరవింద్ కేజ్రీవాల్. గెలిపించిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒక్కసారిగా గుజరాత్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అంతే కాకుండా ప్రతి నెలా ఉద్యోగాలు లేకుండా ఉన్న నిరుద్యోగులకు రూ. 3,000 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గుజరాత్ లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ లోని సహకార రంగంలో ఉద్యోగాలన్నీ సన్నిహితులు, బంధువులకే ఇస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం.
ఆప్ ను గెలిపిస్తే గనుక ఎలాంటి అవినీతి, అక్రమాలకు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా ఆప్ చీఫ్ మరింత దూకుడు పెంచడంతో కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తం అయ్యాయి.
Also Read : నాందేడ్ శివసేన చీఫ్ పై ఠాక్రే వేటు