CWG 2022 INDW vs AUSW : భారత మహిళా జట్టుకు రజతం
భారత్ పోరాటం దక్కని విజయం
CWG 2022 INDW vs AUSW : బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో(CWG 2022) మొదటిసారిగా ప్రవేశ పెట్టిన విమెన్స్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది.
భారత జట్టును ఓడించింది. కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. 65 పరుగులతో సత్తా చాటింది.
కానీ జట్టును గెలిపించ లేక పోయింది. తొలి బంగారు పతకాన్ని ఆసిస్ దక్కించుకుంది. 162 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి
దిగిన భారత్ స్మృతి మంధాన, షఫాలీ వర్మలు నిరాశ పరిచారు.
అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ , జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి మూడో వికెట్ కు 96 పరుగులు జోడించింది 33 పరుగుల వద్ద జెమిమా వెనుదిరిగింది.
ఆ తర్వాత ఆష్లీ గార్డ్ నర్ వరుస బంతుల్లో హర్మన్ ప్రీత్ కౌర్ , పూజా వస్త్రాకర్ వికెట్లను పడగొట్టింది.
దీంతో ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసిస్ బౌలర్ల ధాటికి భారత జట్టు(INDW vs AUSW CWG 2022) 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది.
బెత్ మూనీ 41 బంతులు ఆడి 61 పరుగుఉల చేసింది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాధా యాదవ్
అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకుంది.
మెగ్ లానింగ్ ను రనౌట్ చేసింది. తహ్లియా మెక్ గ్రాత్ ను కళ్లు చెదిరే క్యాచ్ పట్టింది. ఈ గేమ్స్ లో భారత జట్టు మొదటి మ్యాచ్ ఆసిస్ తో ఓడి పోయింది. దాయాది పాకిస్తాన్ ను మట్టి కరిపించింది.
బార్బడోస్ ను 100 పరుగుల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ కు చుక్కలు చూపించి నేరుగా ఫైనల్ కు చేరింది.
Also Read : జేడీయూ బీజేపీ మధ్య పెరిగిన దూరం