Alibaba Lays Off : అలీబాబాలో 10,000 వేల మంది తొలగింపు
చైనా ప్రభుత్వ దెబ్బకు ఠారెత్తిన బిగ్ కంపెనీ
Alibaba Lays Off : ప్రపంచంలో మోస్ట్ పాపులర్ కంపెనీగా పేరొందింది అలీబాబా. దాని చీఫ్ జాక్ మా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చైనా సర్కార్ జాక్ మా పై కన్నెర్ర చేయడం,
ఆయన వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది. దీంతో కొంత మేర నష్టం వాటిల్లింది. విచిత్రం ఏమిటంటే అలీబాబా(Alibaba Lays Off) కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.
గత మూడు నెలల కాలంలో ఏకంగా 10,000 మంది ఉద్యోగులకు మంగళం పాడింది. జూన్ లో నికర ఆదాయంలో 50 శాతం తగ్గుదల రావడం వీరి తొలగింపునకు ప్రధాన కారణం.
నిదానమైన అమ్మకాలు, దేశంలో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మధ్య ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఇది. ఈ అలీబాబా ఈ కామర్స్ సంస్థ జూన్ త్రైమాసికంలో 9,241 మంది ఉద్యోగులను విడిచి పెట్టింది.
ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేసింది. 22.74 బిలియన్ యువాన్లకు (యుఎస్ 3.4 బిలియన్లు ) రిపోర్ట్ చేసింది.
గత ఏడాది ఇదే కాలంలో 45.14 బిలియన్ యువాన్లకు తగ్గింది. ఇదిలా ఉండగా అలీబాబా 1999లో ఏర్పాటు చేశారు జాక్ మా. 2015లో డేనియల్ జాంగ్ కు సిఈఓగా బాధ్యతలు అప్పగించారు జాక్ మా.
2019లో ఆయనను చైర్మన్ గా నియమించడంతో కంపెనీ పునర్వీవ్యవస్థీకరణకు గురైంది. జూలైలో అలీబాబా హాంకాంగ్ లో ప్రైమరీ లిస్టింగ్ కోసం దరఖాస్తు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇది మొదటిసారిగా చైనా పెట్టుబడిదారుల విస్తారమైన సమూహానికి సంస్థను తెరిచింది. సెప్టెంబర్ 2014లో న్యూయార్క్ లో అలీబాబా పబ్లిక్ కంపెనీగా మారింది.
న్యూయార్క్ , హాంకాంగ్ రెండింటి లోనూ ప్రాథమిక జాబితాలతో అలీబాబా మొదటి అతి పెద్ద కంపెనీగా మారింది.
Also Read : తక్కువ మొత్తం ఎక్కువ ఆదాయం