Imran Khan Biden : బైడన్ తో దోస్తీకి ఇమ్రాన్ ఖాన్ ఆసక్తి
లాబీయింగ్ కోసం ఓ సంస్థతో ఒప్పందం
Imran Khan Biden : నిన్నటి దాకా అమెరికాను తిట్టి పోస్తూ వచ్చారు పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడి పోయాడు.
ఈ తరుణంలో తాను దిగి పోయేందుకు ప్రధాన కారణం పెద్దన్న అమెరికానే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. తాను రష్యాతో స్నేహంగా ఉండడం, ఆఫ్గనిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిణగించిన యుఎస్ తనను దించేందుకు పరోక్షంగా ప్రయత్నం చేసిందంటూ విమర్శలు చేశాడు ఇమ్రాన్ ఖాన్.
ఇదే మాజీ ప్రధాన మంత్రికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది. గతం మరిచి పోయి యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్ తో సత్ సంబంధాలు నెలకొల్పు కోవాలని అనుకుంటున్నాడు.
ఇదే విషయాన్ని తన పార్టీ పీటీఐ కూడా ధ్రువీకరించింది. ఇందు కోసం లాబీయింగ్ చేసేందుకు ఓ సంస్థను కూడా సంప్రదించినట్లు సమాచారం. దాని కోసం భారీ ఎత్తున ఖర్చు కూడా చేసేందుకు రెడీ అయ్యారట.
ఆ సంస్థ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్(Joe Biden) తో స్నేహ సంబంధాలు పునరుద్దరణ కొనసాగించేలా ప్రయత్నం చేస్తుంది.
ప్రతి నెలా కొంత మొత్తం ఫీజు కింద పీటీఐ చెల్లించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. ఈ విషయాన్ని పీటీఐ ధ్రువీకరించింది కూడా. తనను తప్పించడం వెనుక అమెరికా హస్తం ఉందంటూ ఆరోపించాడు.
ఆపై యుఎస్ కీలుబొమ్మగా ప్రస్తుత పీఎం షెహబాజ్ ను నిందించారు. ప్రస్తుతం ఇమ్రాన్ చేస్తున్న ఈ ప్రయత్నం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.
Also Read : కాశ్మీర్ లో వలస కూలీ కాల్చివేత