National Flag Comment : త్రివర్ణ పతాకం అంగట్లో సరుకు కాదు
హత విధీ..అమ్మకానికి జాతీయ జెండా
National Flag Comment : ఈ దేశం ఎటు పోతోంది. ఒక రకంగా కోట్లాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనా ఇది అన్న అనుమానం కలుగుతోంది. ఫక్తు వ్యాపారంగా మారి పోయింది. బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయింది. సంక్షేమ ప్రభుత్వంలో ప్రజలకు ప్రయారిటీ ఉంటుంది.
కానీ ప్రైవేట్ కంపెనీగా మారి పోతే లాభాల ఆర్జనే ముఖ్యంగా మారి పోతుంది. జాతీయ వాదం పేరుతో కొలువు తీరిన పాలకులు ఇవాళ జాతీయ జెండాను కూడా వ్యాపారం చేయడం బాధాకరం.
జాతీయ జెండా (National Flag) అన్నది దేశానికి ప్రతీక. ఆత్మ గౌరవానికి కోట్లా ప్రజల ఆస్తి అది. అదో చిహ్నం. జాతికి , దేశానికి , సమున్నత భారతావనికి కొండ గుర్తు. అలాంటి దానిని కూడా వ్యాపారంగా మార్చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి దక్కుతుంది.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆపై హర్ ఘర్ తిరంగా పేరుతో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగుర వేయాలంటూ పిలుపునిచ్చారు.
జాతీయ జెండా అంటే స్వశక్తికి , ఖాదీ పరిశ్రమకు, నేతన్నలకు ఒక ఆలంబన. ఒక రకంగా వారి కష్టార్జితంతో తయారయ్యే పతాకాలు ఆత్మ గౌరవానికి ప్రతీకలు.
కానీ ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్లిక్ జాతీయ పతాకాలు కొలువు తీరుతున్నాయి. విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ
పోస్టాఫీసు జాతీయ జెండాలను విక్రయిస్తోంది.
ఎవరైనా సరే త్రివర్ణ పతాకాన్ని(National Flag) కొనుగోలు చేస్తే ఉచితంగా డెలివరీ చేస్తామని ప్రకటించింది. పది రోజుల్లో కోటికి పైగా జాతీయ పతాకాలను విక్రయించింది.
ఇది పక్కన పెడితే హర్యానా లోని బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా పేదలు తీసుకునే రేషన్ షాపుల్లో విధిగా రూ. 20 పెట్టి జెండాను కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆ రేషన్ డిపో డీలర్ పై చర్యలు తీసుకుంది.
దేశ విముక్తి కోసం లక్షలాది మంది త్యాగాలు చేస్తే, బలిదానాలకు పాల్పడితే, ఉరి కొయ్యలను ముద్దాడితే, తూటాలకు బలై పోతే వచ్చింది దేశనికి స్వాతంత్రం.
చివరకు మోదీ ప్రభుత్వం సమున్నత ప్రజలు గౌరవ సూచకంగా వినమ్రంగా నమస్కరించే జాతీయ జెండాను ప్రచారానికి వాడుకోవడం బాధాకరం. ఎవరూ ఈ నిర్ణయాన్ని హర్షించరు.
ఇకనైనా త్రివర్ణ పతాకం అంటే ఒకరు కొనుగోలు చేసేది కాదు. దానికి విలువ నిర్ణయించలేం. వెల కట్టలేం. జాతీయ జెండా అన్నది అంగట్లో
దొరికే సరుకు కాదని తెలుసు కోవాలి.
Also Read : కోటి జెండాలు అమ్మిన పోస్టల్ శాఖ