TTD : పోటెత్తిన భ‌క్త‌జ‌నంతో తిరుమ‌ల కిట‌కిట‌

30 గంట‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం

TTD : క‌లియుగ దైవంగా భావించే శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ కొలువు తీరిన తిరుమ‌ల భ‌క్తుల ర‌ద్దీతో కిట‌కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా భ‌క్త జ‌న‌సందోహంతో నిండి పోయింది పర‌మ ప‌విత్ర పుణ్య‌క్షేత్రం.

వ‌రుస సెలువులు కావ‌డం, పంద్రాగ‌స్టు రావ‌డంతో భ‌క్తులు పెద్ద ఎత్తున స్వామి వారి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. ఓ వైపు తిరుమ‌ల అంతా భ‌క్తుల‌తో నిండి పోయింది.

మొన్న‌టి దాకా 20 గంట‌ల స‌మ‌యం ఉండ‌గా ఇవాల్టితో ఆ స‌మ‌యం మ‌రింత పెరిగింది. ఏకంగా 30 గంట‌ల‌కు పైగా స్వామి, అమ్మ వార్ల ద‌ర్శ‌నం కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

స‌ర్వ ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్, కాంపార్ట్ మెంట్ ల్లో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు భ‌క్తులు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) ముంద‌స్తుగానే భ‌క్తుల‌కు విన్న‌వించింది.

ద‌య‌చేసి రావ‌ద్ద‌ని, వ‌స్తే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని. కానీ భ‌క్తులు అవేవీ ప‌ట్టించు కోలేదు. ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తుల‌కు టీటీడీ అన్న ప్ర‌సాదం, తాగు నీరు, చిన్న పిల్ల‌ల కోసం పాల‌ను పంపిణీ చేస్తోంది.

ఒక్క ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భ‌క్తులు ద‌ర్శించు కోవ‌డం విశేషం. ఏకంగా 92 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి , అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు.

52 వేల మందికి పైగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. ఇక భక్తులు వేసిన హుండీల‌ను లెక్కిస్తే రూ. 4. 36 కోట్ల‌కు పైగా స‌మ‌కూరింది. ఇక వీఐపీ, అధికారిక ద‌ర్శ‌నాలకు సంబంధించి సిఫార‌సు లేఖ‌ల‌ను ర‌ద్దు చేసింది టీటీడీ.

వ‌రుస సెల‌వుల కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ఆగ‌స్టు 21 వ‌ర‌కు వీటిని తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు టీటీడీ ఈఓ ధ‌ర్మారెడ్డి.

Also Read : భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త్ బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!