IND vs ZIM 2nd ODI : వన్డే సీరీస్ పై కన్నేసిన భారత్
జింబాబ్వే అడ్డుకట్ట వేసేనా
IND vs ZIM 2nd ODI : భారత, జింబాబ్వే జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది ఇవాళ. మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్పటికే టీమిండియా మొదటి వన్డేలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ఏకంగా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సాధించింది. 190 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. చరిత్ర సృష్టించింది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 81 రన్స్ చేస్తే యంగ్ స్టార్ శుభ్ మన్ గిల్ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుందనుకున్న మ్యాచ్ చివరకు ఏకపక్షంగా సాగింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించిన జింబాబ్వే భారత్ తో(IND vs ZIM 2nd ODI) చేతులెత్తేసింది.
ఇక రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించు కోవాలని చూస్తోంది ఆతిథ్య జట్టు. అయితే ఈ మ్యాచ్ కూడా విజయం సాధించి సీరీస్ కైవసం చేసుకోవాలని అనుకుంటోంది భారత్. ఏది ఏమైనా ఇరు జట్ల మధ్య పోరు సాగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక జట్టు పరంగా చూస్తే అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటుతోంది. ఇక జట్ల పరంగా చూస్తే టీమిండియాకు రాహుల్ కెప్టెన్ కాగా, ధావన్ వైస్ కెప్టెన్. గిల్, ఇషాన్ కిషన్ , దీపక్ హూడా, సంజూ శాంసన్ , అక్షర్ పటేల్ , దీపక్ చహర్ , కుల్దీప్ , ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఉన్నారు.
ఇక జింబాబ్వే జట్టు పరంగా చేస్తే చకబ్బా కెప్టెన్ . కైయా, మరుమని, సియాన్ విలియమ్స్ , వెస్లీ, సికిందర్ రజా, రియన్ బర్ల్, జాంగ్వే, ఇవాన్స్ , విక్టర్ , రిచర్డ్ ఆడతారు.
Also Read : ధావన్ ధనా ధన్ గిల్ సెన్సేషన్