Sonia Gandhi Gehlot : అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ ఆఫర్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బంపర్ ఛాన్స్
Sonia Gandhi Gehlot : కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. త్వరలో పార్టీకి సంబంధించిన చీఫ్ గా ఎన్నిక జరగనుంది. ప్రస్తుతానికి సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్ గా కొనసాగుతూ వస్తున్నారు.
గాంధీ కుటుంబానికి నాయకత్వం అప్పగించడంపై పార్టీలోనే అసమ్మతి వర్గం ప్రశ్నిస్తూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో అత్యధిక శాతం రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారు.
ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). ఇదిలా ఉండగా 2019లో జరిగిన జాతీయ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూసింది.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపై ఆయన కొంత కాలం పాటు విదేశాలకు వెళ్లారు.
దీంతో పార్టీ దిక్కులేనిదిగా మారింది. ఇదే సమయంలో తాత్కాలిక చీఫ్ గా ఉండేందుకు అంగీకరించారు సోనియా గాంధీ(Sonia Gandhi). ఇదే సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో తాము అధ్యక్ష పదవిలో ఉండేందుకు ఇష్ట పడడం లేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో ఎవరు గాంధీయేతర వ్యక్తి 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అవుతారనే దానిపై చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో పార్టీలో మొదటి నుంచీ ఉంటూ గాంధీ ఫ్యామిలీకి లాయల్ గా ఉంటూ వచ్చిన అశోక్ గెహ్లాట్ ను పార్టీ చీఫ్ గా ఉండమని సోనియా గాంధీ కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి అందుకు గెహ్లాట్ ఒప్పుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. మరి వ్యతిరేక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాం నబీ ఆజాద్ ఏమంటారో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read : మోదీ ప్లాన్..అదానీ ఎన్డీటీవీ కొనుగోలు