India Tell : ఆయిల్ ధరల పరిమితిపై ఏకాభిప్రాయం అవసరం
పెద్దన్న అమెరికాకు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
India Tell : భారత ప్రభుత్వం చమురు ధరల పరిమితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా రష్యా ఆయిల్ ధరల పరిమితిపై ఏకాభ్రిపాయం అవసరమని అమెరికాకు కుండ బద్దలు కొట్టింది.
మార్కెట్ నుండి చమురును తీసుకోకుండా , ధరల పెరుగుదలను ప్రేరేపించకుండా ఉండేలా చూడాలని సూచించింది.
ఉక్రెయిన్ పై దాడికి నిధులు సమకూర్చే ఆదాయాన్ని రష్యాకు అందకుండా చేస్తుందని అంచనా వేసిన ధరల పరిమితి ఆలోచనలో మిత్ర దేశాలను చేర్చుకునే ప్రయత్నాలకు యుఎస్ నాయకత్వం వహిస్తోంది.
కొనుగోదారులందరితో ఏకాభిప్రాయం కుదరక పోతే ప్లాన్ లో చేరేందుకు భారత దేశం(India Tell) వెనుకాడుతోంది. దీని విషయంపై పునరాలోచనలో పడింది.
రష్యా చమురు ధరలను నియంత్రించేందుకు అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే ముందు భారత దేశం విస్తృతంగా ఏకాభిప్రాయాన్ని కోరుతోంది.
ఈ వారంలో అమెరికన్ అధికారులు ముంబై , న్యూఢిల్లీకి వచ్చే సమయంలో దీనిని ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. కొనుగోలుదారులు అందరితో ఏకాభిప్రాయం కుదరక పోతే ఈ ప్లాన్ లో చేరాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
ఇప్పటికే డెలిగేషన్స్ తో మీటింగ్ ప్రారంభమైంది. ఈ సమావేశం శుక్రవారం వరకు కొనసాగనుంది. యుఎస్ డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడెయోయో , అతని టీంకు ఈ విషయాన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా చమురు ధరల పరిమతి ప్రభావం చైనా, భారత దేశం వంటి కీలక కస్టమర్ల కట్టుబాట్లపై ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్ పై దాడి తర్వాత చాలా దేశాలు రష్యాపై ఆధారపడ్డాయి.
Also Read : కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ తొలగింపు