CM KCR : నేనుండ‌గా తెలంగాణ‌ను ఆగం కానివ్వ‌ను

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్

CM KCR :  సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను బ‌తికి ఉండ‌గా, కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తాను తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వ‌నంటూ హెచ్చ‌రించారు.

గురువారం రంగారెడ్డి జిల్లా కొంగ‌రక‌లాన్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు కేసీఆర్. పంట‌లు పండించే తెలంగాణ కావాలా లేక మంట‌ల తెలంగాణ కావాలా అని తేల్చుకోవాల్సింది ప్ర‌జ‌లేన‌ని అన్నారు సీఎం.

ఇలాగే మౌనంగా ఉంటే మాత్రం కేంద్రం మ‌న‌పై పెత్త‌నం చెలాయించేందుకు రెడీగా ఉంటుంద‌న్నారు. తాను త‌ల వంచే వ్య‌క్తిని కాన‌ని ఎదుర్కొనే ద‌మ్ము ధైర్యం త‌న‌కు ఉంద‌న్నారు కేసీఆర్(CM KCR).

ఇంకా ఇలాగే వుంటే మ‌త చిచ్చు పెట్టేందుకు య‌త్నిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప‌శ్చిమ బెంగాల్ , ఢిల్లీ ప్ర‌భుత్వాల‌ను కూల్చే కుట్ర‌లు కొన‌సాగుతున్నాయంటూ మండిప‌డ్డారు.

ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో నిద్ర పోతే తీవ్రంగా న‌ష్ట పోతామ‌న్నారు కేసీఆర్. దేశానికి ఎనిమిదేళ్ల తెలంగాణ ఆద‌ర్శంగా ఉంద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా 24 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌డం లేద‌న్నారు సీఎం.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) కుట్రలు పన్ని ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. ద‌మ్ముంటే నేరుగా త‌న‌తో ఢీకొనాల‌ని దొడ్డిదారిన కాద‌న్నారు. తాను ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ‌ను ముట్టు కోలేర‌న్నారు సీఎం.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో నిరంకుశ పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాల‌న‌లో ఒక్క మంచి ప‌ని దేశం కోసం చేయ‌లేద‌న్నారు కేసీఆర్.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రైతు బంధు ప‌థ‌కం ఇక్క‌డ మాత్ర‌మే అమ‌లవుతోంద‌న్నారు.

Also Read : రాజా సింగ్ పై పీడీ యాక్టు – సీపీ

Leave A Reply

Your Email Id will not be published!