CV Anand : రాజా సింగ్ పై పీడీ యాక్టు – సీపీ

ప్ర‌క‌టించిన క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్

CV Anand : న‌గ‌రంలోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే టి. రాజా సాంగ్(Raja Singh) కు షాక్ మీద షాక్ త‌గులుతోంది. ముస్లింల మ‌నోభావాల‌ను కించ ప‌రిచార‌ని, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను దూషించేలా కామెంట్స్ చేశారంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

దీంతో ఆయ‌న ఇంటి చుట్టూ భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా క‌స్ట‌డీకి అనుమితించ లేదు.

గురువారం మ‌రోసారి టి. రాజా సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాజాగా మ‌రో షాక్ ఇచ్చారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు.

చాలాసార్లు ఒక మ‌తాన్ని, వ‌ర్గాన్ని కించ ప‌రిచేలా రాజాసింగ్ కామెంట్స్ చేశారంటూ వెల్ల‌డించారు. ఇవాళ సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ్ మాట్ పోలీస్ స్టేష‌న్ లో గ‌తంలో రాజా సింగ్ పై రౌడీషీట్ కూడా న‌మోదై ఉంద‌న్నారు.

ఈ కేసుల‌ను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేల‌పై పీడీ యాక్టు న‌మోదు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆగ‌స్టు 22న ఓ యూట్యూబ్ చాన‌ల్ లో రాజాసింగ్ రెచ్చ‌గొట్టేలా కామెంట్స్ చేశార‌ని తెలిపారు సీపీ ఆనంద్(CV Anand) .

ప్ర‌వ‌క్త‌కు వ్య‌తిరేకంగా కూడా మాట్లాడార‌ని వెల్ల‌డించారు. మ‌రో వైపు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ఒక శాస‌న స‌భ్యుడిపై పీడీ యాక్టు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం.

Also Read : త‌గ్గేదే లేదంటున్న రాజా సింగ్

Leave A Reply

Your Email Id will not be published!