Sukumar Puri Jagannath : విజ‌య్ కి న‌త్తి వెనుక బ‌న్నీ ప్లాన్ – పూరీ

సుకుమార్ తో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్

Sukumar Puri Jagannath : ఒక‌రేమో డైన‌మిక్ డైరెక్ట‌ర్ మ‌రొక‌ర‌మో స్టార్ ద‌ర్శ‌కుడు. మ‌రి ఇద్ద‌రూ క‌లిసి మ‌నసు విప్పి మాట్లాడుకుంటే బోలేడు క‌బుర్లు. సినిమాల గురించిన విశేషాలు అల‌వాటుగా దొర్లి పోతుంటాయి.

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ను పుష్ప డైరెక్ట‌ర్ సుకుమార్(Sukumar Puri Jagannath)  ఇంట‌ర్వ్యూ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో విష‌యాలు ముచ్చ‌టించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు పూరీ జ‌గ‌న్నాథ్. సినిమా అన్న‌ది త‌న‌కు ఓ పేష‌న్ అన్నారు. ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్ తో క‌లిపి లైగ‌ర్ మూవీని తీశాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 25న చిత్రం విడుద‌లైంది. రిలీజ్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా సుకుమార్ తాను పూరీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌ని చేశానంటూ షాకింగ్ విష‌యం బ‌య‌ట పెట్టాడు.

ఇప్ప‌టికే సుక్కు అంటేనే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా పేరొందాడు. బ‌న్నీతో ఆయ‌న తీసిన పుష్ప సెన్సేష‌న్. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌రే కాదు. అద్భుత‌మైన భావుకుడు. ఆలోచ‌నా ప‌రుడు. క‌థ‌లు రాయ‌డంలో పేరొందారు.

ఆయ‌న డైరెక్ష‌న్ వెనుక ఉన్న తాను చేసే కృషి ఏమిటో తెలిపాడు. ఇదే స‌మ‌యంలో ఎందుక‌ని లైగ‌ర్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) కు లోపం ఎందుకు పెట్టారంటూ ప్ర‌శ్నించాడు.

దీనిపై ఆస‌క్తిగా స్పందించాడు. ఈ ఆలోచ‌న త‌న‌ది కాద‌ని ఆ క్రెడిట్ అంతా అల్లు అర్జున్(Allu Arjun) కే చెందుతుంద‌న్నాడు. ఏదైనా లోపం హీరోకు పెట్టండి బాస్. డిఫ‌రెంట్ గా డిజైన్ చేయ‌మంటూ సూచించాడ‌ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు.

Also Read : విజ‌య్ దేవ‌ర‌కొండ నిహారిక బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!