FIFA Lifts Ban : ఫుట్ బాల్ ఫెడ‌రేష‌న్ పై నిషేధం ఎత్తివేత

అండ‌ర్ -17 ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఓకే

FIFA Lifts Ban : భార‌త ఫుట్ బాల్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది పిఫా. భార‌త ఫుట్ బాల్ అసోసియేష‌న్ పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది ప్ర‌పంచ ఫుట్ బాల్ స‌మాఖ్య (ఫిఫా). ఈ మేర‌కు అధికారికంగా శ‌నివారం ప్ర‌క‌టించింది .

దీంతో భార‌త దేశం అండ‌ర్ -17 మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ 2022కి ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడ‌రేష‌న్(FIFA Lifts Ban) మూడో స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి ద్వారా ఒత్తిళ్ల‌కు, ప్ర‌లోభాల‌కు గురి చేసిందంటూ ఫిఫా నిషేధం విధించింది.

దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఎలాగైనా స‌రే కేంద్ర స‌ర్కార్ కు సూచించింది. భార‌త క్రీడా ప‌రువుకు భంగం క‌లిగించేలా అవుతుంద‌ని, వెంట‌నే జోక్యం చేసుకుని నిషేధం విధించేలా ఫిఫాతో సంప్ర‌దింపులు జ‌రపాల‌ని సూచించింది.

ఈ మేర‌కు కేంద్రం రంగంలోకి దిగింది. ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. విధించిన స‌స్పెన్ష‌న్ ను ప్ర‌పంచ ఫుట్ బాల్ గ‌వ‌ర్నింగ్ బాడీ ఎత్తి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీని వ‌ల్ల వ‌చ్చే అక్టోబ‌ర్ నెల‌లో జ‌రిగే అండ‌ర్ -17 మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ 2022కి భార‌త దేశం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అన‌వ‌స‌ర‌మైన మూడో పార్టీ ప్ర‌భావం కార‌ణంగా ఏఐఎఫ్ఎఫ్ పై విధించిన స‌స్పెన్ష‌న్ ను ఎత్తి వేయాల‌ని ఫిఫా కౌన్సిల్ బ్యూరో నిర్ణ‌యించింద‌ని ప్ర‌క‌టించింది.

నిర్వాహ‌కుల క‌మిటీ ఆదేశం ర‌ద్దు చేయ‌బ‌డింద‌ని, ఏఐఎఫ్ఎఫ్ ప‌రిపాల‌న‌, రోజూ వారీ వ్య‌వ‌హారాల పై పూర్తి నియంత్ర‌ణ‌ను తిరిగి పొందింద‌ని ఫిఫా ధ్రువీక‌రించిన త‌ర్వాత గ‌వ‌ర్నింగ్ బాడీ లిఫ్ట్ ఎత్తి వేసింది.

Also Read : కీప‌ర్ గా కార్తీక్ కంటే పంత్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!