Saba Karim : హానీమూన్ పీరియ‌డ్ ముగిసింది – స‌బా క‌రీం

భార‌త జ‌ట్టు నిష్క్ర‌మ‌ణ‌పై షాకింగ్ కామెంట్స్

Saba Karim :  అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ -2022 మెగా టోర్నీ నుంచి భార‌త జ‌ట్టు నిష్క్ర‌మించింది. శ్రీ‌లంక‌, పాకిస్తాన్ చేతిలో ఓట‌మి పాలై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

ఎవ‌రు ఆడుతున్నారో ఎందుకు ఆడుతున్నారో తెలియ‌కుండా ఆడుతున్న ఏకైక జ‌ట్టుగా పేరొందింది టీమిండియా. ప‌రిణ‌తి క‌లిగిన దిగ్గ‌జ ఆట‌గాడిగా పేరొందిన రాహుల్ ద్ర‌విడ్ ను ఏరికోరి బీసీసీఐ చైర్మ‌న్ సౌర‌వ్ గంగూలీ నియ‌మించారు.

కానీ ప్లేయ‌ర్ల ఆట తీరులో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. రెండు సార్లు గెలిస్తే నాలుగు సార్లు ఓట‌మి పాల‌వుతోంది టీమిండియా. ఇక భార‌త క్రికెట్ జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

తాజాగా టోర్నీ నుంచి త‌ప్పుకున్న టీమిండియా తీరుపై భార‌త మాజీ సెలెక్ట‌ర్, మాజీ వికెట్ కీప‌ర్ స‌బా క‌రీం(Saba Karim) నిప్పులు చెరిగాడు. హానీమూన్ పీరియ‌డ్ ముగిసింది ఇక వ‌చ్చేయండంటూ ఎద్దేవా చేశాడు.

ఆయ‌న ప్ర‌ధానంగా హెడ్ కోచ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగేందుకు కేవ‌లం నెల రోజులు మాత్ర‌మే ఉంది.

ఇప్పుడున్న జ‌ట్టు గ‌నుక ఆడితే ఆరంభంలోనే ఇంటి బాట ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు స‌బా కరీం. 2021లో భార‌త జ‌ట్టుకు కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ ను నియ‌మించిన‌ప్పుడు అంచ‌నాలు ఎక్కువ‌గా ఉండేవ‌ని, కానీ ఇప్పుడు ఆ అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయ‌ని పేర్కొన్నాడు.

ద్ర‌విడ్ కు ఇది క‌ష్ట కాలం అని హెచ్చ‌రించాడు స‌బా క‌రీం.

Also Read : గెలుపు కంటే ఎలా ఆడామ‌న్న‌దే ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!