Ramiz Raja : ప్రయోగాల వల్లే భారత్ పరాజయం – రమీజ్ రజా
భారత జట్టు నిష్క్రమణపై కామెంట్స్
Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022(Asia Cup 2022) ఆఖరి అంకానికి చేరుకుంది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్స్ గా భారత్, పాకిస్తాన్ లు ఉన్నాయి.
కానీ ఊహించని రీతిలో శ్రీలంక ఫైనల్ కు చేరింది. ఆ జట్టుతో పాటు పాకిస్తాన్ కూడా టైటిల్ వేటలో నిలిచింది. విచిత్రంగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆఫ్గనిస్తాన్ పై భారీ తేడాతో నెగ్గినా శ్రీలంక చేతిలో కీలక మ్యాచ్ లో పరాజయం పొందడంతో మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. భారత జట్టు లేక పోవడంపై స్పందించాడు పీసీబీ చైర్మన్ రమీజ్ రజా(Ramiz Raja). ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎందుకు టీమిండియా సత్తా చాట లేక పోయిందనే విషయంపై స్పష్టత ఇచ్చాడు. పాకిస్తాన్, భారత్ జట్టు రెండుసార్లు తలపడ్డాయి ఈ టోర్నీలో. మొదటి మ్యాచ్ లో భారత్ గెలుపొందితే రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది.
చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. తమ జట్టు ఫైనల్ కు చేరుకోవడాన్ని ప్రశంసించాడు. తాము ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని అందుకే తమ టీం నిలకడగా రాణిస్తోందన్నాడు.
కానీ అలాంటి పరిస్థితి భారత జట్టు(Team India) లో లేకుండా పోయిందని పేర్కొన్నాడు. ఎందుకంటే వారికి జట్టు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు లైన్ లో ఉన్నారు.
దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రయోగాలు చేసుకుంటూ పోతోందని దాని వల్లనే భారత జట్టు ఓటమి పాలైందని పేర్కొన్నాడు పీసీబీ చైర్మన్ రమీజ్ రజా.
Also Read : ద్రవిడ్..రోహిత్ పై వెంగ్ సర్కార్ ఫైర్