Team India T20 World Cup : టి20 వరల్డ్ కప్ జట్టుపై ఉత్కంఠ
ఇకనైనా సంజూ శాంసన్ కి ఛాన్స్ దక్కేనా
Team India T20 World Cup : యూఏఈ వేదికగా ఆసియా కప్ – 2022 కథ ముగిసింది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్నా పేలవమైన చెత్త
ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఇంటి బాట పట్టింది.
ఇక కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది మరో మెగా ఈవెంట్ జరిగేందుకు. గత ఏడాది 2021లో యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎగరేసుకు పోయింది.
ప్రస్తుతం వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్(Team India T20 World Cup) నిర్వహిస్తోంది ఐసీసీ. సెప్టెంబర్ 15 లోపు ప్రపంచంలోని
క్రికెట్ జట్లన్నీ తమ తుది జట్లను ప్రకటించాలని ఇప్పటికే ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా నాలుగు రోజుల టైం ఉంది. భారత జట్టు ఆట తీరుపై, కెప్టెన్ , ద్రవిడ్ అనుసరిస్తున్న విధానాలతో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్వాకంపై
సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో ఆడే ఆటగాళ్లకు చాన్స్ ఇస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా తాజా, మాజీ ఆటగాళ్లు. ఇక వన్డే, టెస్టులలో రిషబ్ పంత్ రాణించినా టి20లో నిరాశ పరిచాడు.
దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక జట్టు పరంగా చూస్తే బుమ్రా, కేఎల్ రాహుల్ , కోహ్లీ, షమీ,
జడేజా, పంత్ లేదా శాంసన్ , రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ , సూర్య కుమార్ యాదవ్ , యుజ్వేంద్ర చాహల్ , దినేష్ కార్తీక్, పాండ్యా, హర్షల్ పటేల్ ను పరిగణలోకి తీసుకోనున్నారు.
మొత్తం 15 మందితో కూడిన జట్టుతో పాటు స్టాండ్ బై ఆటగాళ్లుగా ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇషాన్ కిషాన్ పర్ ఫార్మెన్స్ బాగా లేదు.
మొత్తంగా జట్టును ఎంపిక చేయడం అన్నది సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మకు కత్తి మీద సాము లాగా తయారైంది.
Also Read : ప్రయోగాల వల్లే భారత్ పరాజయం – రమీజ్ రజా