KV Kamath : 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
సంచలన కామెంట్స్ చేసిన కేవీ కామత్
KV Kamath : ప్రముఖ భారతీయ బ్యాంకర్ , నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్ మెంట్ చైర్మన్ కేవీ కామత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాబోయే 25 ఏళ్లలో 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత దేశం మారనుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రపంచంలోనే ఐదవ అతి పెద్దదిగా ఇండియా ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్ , జర్మనీల తర్వాత భారత్ ఉంది. కాగా శరవేగంగా మార్కెట్ రంగంలో దూసుకు పోతున్న క్రిప్టో కరెన్సీ పై మాత్రం తనకు అనుమానం ఉందన్నారు కేవీ కామత్(KV Kamath).
మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ లో కామత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల ప్రారంభంలో భారత దేశం యునైటెడ్ కింగ్ డమ్ ను దాటేసింది.
ఇతర దేశాలను కోలుకోలేని షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాతి స్థానంలో ఉంది భారత్.
ఇంతకు ముందు ఎన్నడూ సాధ్యం కాదని అనుకున్నారు. కానీ భారత దేశం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తన అంచనా ప్రకారం 7 నుంచి 8 శాతం వృద్దిని అనుకుంటున్నానని చెప్పారు కేవీ కామత్(KV Kamath).
రాబోయే కొన్నేళ్లల్లో అది మరింత వృద్ది చెందుతుందన్న నమ్మకం తనకు బలంగా ఉందన్నారు.
తాజా అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.5 ట్రిలియన్లుగా ఉందని, వృద్ది రేటు 8 శాతంగా ఉందని ప్రతి 9 ఏళ్లకు అది రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
Also Read : పసిఫిక్ దీవులపై భారత్..యుఎస్ ఫోకస్